Header Banner

శ్రీవిద్య, ఒక చిన్నారి యొక్క ఆశ! శ్రీవిద్యకు ప్రభుత్వం త్వరగా సహాయం చేయాలి!

  Thu Mar 06, 2025 10:31        Helping Hand

ఎనిమిదేళ్ల మల్లెల శ్రీవిద్యకు చదువుపై అమితమైన ఆసక్తి ఉన్నా, నిర్దాక్షిణ్యమైన నిబంధనల కారణంగా బడికి వెళ్లలేకపోతోంది. రోజూ స్కూలుకు వెళ్తున్న తన తోటి పిల్లలను చూసి, తానూ అలానే యూనిఫాం ధరించి, పుస్తకాల సంచీ భుజానేసుకొని వెళ్లాలని కలలు కంటోంది. కానీ, ఆమె కల నెరవేరడం లేదు. సనత్‌నగర్ దాసారం బస్తీలో నివసించే ఆమె తల్లిదండ్రులు, ఆర్థికంగా వెనుకబడిన కార్మికులు. సంవత్సరంముందు ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆమెను చేర్పించినా, బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేకపోవడంతో స్కూలు యాజమాన్యం ఆమెను తరగతులకు అనుమతించలేదు.

 

ఇది కూడా చదవండి: వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

తల్లి మమత ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వ అధికారులు ఆస్పత్రి నుంచి జనన ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలని అన్నారు. కానీ, శ్రీవిద్య ఇంట్లోనే పుట్టిన కారణంగా, అలాంటి పత్రం తీయడం సాధ్యపడలేదు. ఇక ఆధార్ కార్డు తీసుకోవడానికి కూడా అదే సమస్య అడ్డుగా మారింది. దీనికి పరిష్కారంగా కొందరు మధ్యవర్తులు రూ.10,000 ఇవ్వాలని చెప్పడంతో, ఆ మొత్తాన్ని సమకూర్చలేక వేదన అనుభవిస్తోంది. బాలిక చదువుకునే హక్కును నిరాకరిస్తూ, కేవలం పత్రాల లొసుగుల పేరుతో ఆమె భవిష్యత్తును అడ్డుకుంటున్న అధికారుల పై కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. వెంటనే స్పందించి శ్రీవిద్యకు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు అందించి, ఆమె చదువు కొనసాగించేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #HelpSriVidya #EducationForAll #SupportHerFuture #GiveHerAChance #ChildEducationMatters #GovernmentSupportNeeded #BreakBarriers #EducationWithoutBoundaries #SriVidyaStruggle #EmpowerTheChildren